Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
అందోల్, జోగిపేట మున్సిపాల్టీ పరిధిలో 576 మందికి శనివారం ఆర్డీఓ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను లాటరీ పద్దతిన ఎంపిక చేసేందుకు శనివారం అందోలులోని లక్ష్మీ నరసింహ ఫంక ్షన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీవో అంబ దాస్ రాజేశ్వర్, తహశీల్దార్ మధుకర్రెడ్డిల సమక్షంలో జోగిపేటలో 252 ఇండ్లు, అందోలు వద్ద రెండు చోట్లలో 324 ఇండ్లను నిర్మించారు. వీటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి 825 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో డబుల్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలాన్ని అందజేసిన 39 మందికి ఇండ్లను కేటాయించి, మిగతా 537 ఇండ్లకు గాను 786 దరఖాస్తులను లాటరీ పద్దతిలో ఎంపిక చేశా రు. డ్రాలో రాని దరఖాస్తుదారులు నిరుపేదలమైనా తమకు ఇళ్లు రాలేవని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా..
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీగా అవక తవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ నాగరాజు నేతత్వంలో ఎస్ఐ సామ్యా నాయక్ పోలీసు సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమింప చేశారు. కాగా విచారణ చేపట్టి అర్హులైన వారికి ఇండ్లను కేటాయించాలని, అప్పటివ రకు నిలిపివేయలంటూ అందోళనకు చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు సంబంధించిన బంధువులకు ఇండ్లు వచ్చాయని కౌన్సిలర్లు చిట్టిబాబు, హరికష్ణాగౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాములు ఆరోపించారు. ఈ విషయంపై తాము రాజీనామాకు సిద్దమని కౌన్సిలర్లు చిట్టిబాబు, హరికృ ష్ణాగౌడ్లు సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కోసం స్థలాలను ఇచ్చిన 39 మంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతనే డ్రాను ప్రారంభించాలని కౌన్సిలర్లు చిట్టిబాబు, రంగ సురేష్, డి.శంకర్, మాజీ ఎంపీటీసీ డీజీ.వెంకటేశం, మాజీ వార్డు మెంబర్ పి.ప్రవీణ్ కుమార్లతో పాటు నాయకులు పట్టు బట్టారు. దీంతో కొద్దిసేపు అధికారులకు, కౌన్సిలర్లకు, నాయ కుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆర్డీవో అంబదా స్ రాజేశ్వర్ చేసేది లేక జోగిపేట డబుల్ ఇండ్లలో 35 మందికి, అందోలు వద్ద నలుగురికి ఇండ్లను కేటాయించా మని, వారి పేర్లను చదివి వినిపించారు. అనంతరం డ్రా పద్దతిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు.