Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 10లోగా క్రీడా ప్రాంగణాలు పూర్తి కావాలి
- ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
- ధరణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
నవతెలంగాణ-సంగారెడ్డి
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డిలతో కలిసి సంగారెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికా రులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 10 లోగా క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో మూడు కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్ ఉండాలన్నారు. పెట్టిన మొక్కల నిర్వహణ సరిగ్గా లేకుంటే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యద ర్శులకు స్వాధీనం చేసి వారి నుండి అండర్ టేకింగ్ లెటర్ తీసుకోవాలని ఎంపీఓలకు సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఏవైనా గ్యాప్స్ ఉంటే వెంటనే మొక్కలు పెట్టాలని సూచించారు. వంద శాతం హరితహారం లక్ష్యం పూర్తి కావాలని, జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. గ్రామం సరిహద్దులో స్వాగతం, సరిహద్దు బోర్డులను ఏర్పా టు చేయాలని సూచించారు. క్లస్టర్‌కు ఒక వైకుంఠ రథాన్ని, బాడీ ఫ్రీజర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. టామ్ టామ్ ద్వారా ఇతర గ్రామాల ప్రజలు వినియోగించుకునేలా తెలియజేయాలన్నారు.పొడి చెత్తతో గ్రామపంచాయతీకి ఆదాయం సమకూ రాలన్నారు. డ్రై వేస్ట్ అమ్మకానికి ఏజెన్సీ లతో టైఅప్ చేయాలని, తడి చెత్త సెగ్రిగేషన్ కావా లని, గ్రామాలలో ఎక్కడ చెత్త కనిపించరాదని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నెలాఖరులోగా బ్యాంకు లింకే జీ లక్ష్యం పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సూచిం చారు. అంగన్వాడి డే జరగాలన్నారు. గర్భవతుల నమోదు వందశాతం కావాలన్నారు. ప్రసవాలన్నీ ప్రభుత్వాసు పత్రుల్లోనే జరగాలన్నారు. అన్ని ఇండికేటర్స్‌ను చేరుకోవాలన్నారు. వైద్యులు అంకితభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. అవసరమైతే డాక్టర్లు వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అవస రమైతే అదనంగా ఏర్పాటు చేయాల న్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలన్నారు. ధరణి సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయరాదని రెవిన్యూ అధికా రులకు సూచించారు. దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని, వారు పొందిన యూనిట్‌తో రెగ్యులర్‌గా ఆదా యం రావాలన్నారు. ఎప్పటికప్పుడు వారి స్థితిగతులను పరిశీలించి నివేదికను అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ సురేష్ మోహన్, సంగారెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గం పరిధిలోని తహసిల్దార్లు, ఎంపీ డీవోలు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, డివిజ నల్ పంచాయతీ అధికారి, ఎంపీఓలు, సిడిపిఓలు, సూపర్వై జర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ఏపీఎంలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.