Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కొండాపూర్
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కొండాపూర్‌ను టీఎస్‌యూటీఎఫ్ నాయకత్వం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి బి.సాయిలు, జిల్లా కార్యదర్శి బి. సాయితేజ మాట్లాడుతూ.. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిరంతరం పోరాటం చేస్తూ ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తున్న మాణిక్ రెడ్డిని గెలిపించాలన్నారు. అలాగే సీపీఎస్ రద్దు, ఎన్ఈ పీ-2020ని రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ చేస్తున్నామన్నారు. పీఆర్సీ అనుబంధ జీఓలు విడుదల చేయాలని, రెసిడెన్సియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు హెల్త్‌కార్డ్స్ ఇవ్వాలని, ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్‌యూ టీఎఫ్ కొండాపూర్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వెంకయ్య, రాములు జిల్లా కార్యదర్శులు సాయితేజ, కృష్ణంరాజు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.