Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు
నవతెలంగాణ-పుల్కల్
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని.. అలాగే మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. సంస్థ గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు శనివారం పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట గ్రామ శివారులో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిలు పాల్గొని మాట్లాడారు. రాత్రి, పగలు తేడా లేకుండా మిషన్ భగీరథ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని వారికి కనీస వేత నాలు అమలు చేయకపోవడం దురదష్టకరమన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రతీనెల చెల్లించాల్సిన వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే యజమాన్యం స్పందించి ప్రతీ కార్మికునికి ఈఎస్ఐ, పీఎఫ్ గుర్తింపు కార్డుతో పాటు ప్రమాద బీమా సౌకర్యం వెంటనే కల్పించాలన్నారు. లేనియెడల కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
నెలాఖరి వరకు ఈఎస్ఐ, పీఎఫ్ కార్డులు అందజేస్తాం
మిషన్ భగీరథలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ కార్డులు అందజేయడంలో జాప్యం జరిగిన విషయం వాస్తవమేనని.. ఈనెల చివరి వరకు ప్రతీ ఒక్క కార్మికునికి ఈఎస్ఐ, పీఎఫ్ కార్డులతో పాటు గుర్తింపు కార్డులు, ఒక నెల బకాయి వేతనాలను చెల్లించే విధంగా చర్యలు చేపడతామని భగీరథ యజమాన్యం కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నాను విరమించారు. కాగా ఇది ముమ్మాటికీ సీఐటీయూ విజయమేనని.. తాము ఎల్లప్పటికీ ఈ యూనియన్లోనే ఉంటామని కార్మికులు అన్నారు. సీఐటీయూ ఆందోల్ నియోజకవర్గ కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు కృష్ణ, సుధాకర్, ఆయా గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.