Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతం ఘనం..కాలక్రమేణా దినదినగండం..
- వివాదాల్లో చిక్కుకుంటున్న ఠాణా సిబ్బంది
- నాలుగేళ్లలో ముగ్గురు అధికారులపై శాఖాపరమైన వేటు
నవతెలంగాణ-బెజ్జంకి.
గతంలో ప్రజలకు ఉత్తమమైన సేవలందించిన బెజ్జంకి ఠాణా.. కాలక్రమేణ ఠాణా సిబ్బంది పలు అవినీతి ఆరోపణలు, వివాదాల్లో చిక్కుకుంటూ శాఖాపరమైన వేటుకు గురవుతోంది. దీంతో వామ్మో..బెజ్జంకి ఠాణానా అని పలువురు పోలీస్ శాఖ ఉద్యోగులు బెంబెలేతతున్నారని వినికిడి. కరీంనగర్ జిల్లా కేంద్రంగా 1989లో బెజ్జంకి ఠాణా ఏర్పడింది. నేటి వరకు 27 మంది రక్షక భటాధికారులుగా విధులు నిర్వర్తించారు. బెజ్జంకి ఠాణాలలో విధులు నిర్వర్తిం చిన సిబ్బంది గతంలో ప్రజలకు ఉత్తమమైన సేలందించిన పలువురు అధికారులు, సిబ్బంది సైతం పదోన్నతులు సాదించి పేరు ప్రఖ్యాతలు గడించారు. కరీంనగర్ జిల్లా పరిధిలో కొనసాగిన రోజుల్లో బెజ్జంకి ఠాణా ఘనంగా సేవలందించి కాలక్రమేణ పలు అవినీతి ఆరోపణలతో ఠాణా సిబ్బంది వివాదాల్లో చిక్కుకుంటూ ఉద్యోగ గండానికి గురవు తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం జిల్లాల పునర్విభజనలో బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలపడంతో జాతీయ స్థాయిలో 46వ ఉత్తమ ఠాణాగా ఎంపికై పేరుప్రఖ్యాతలు గడిచింది. కాలక్రమేణ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పలు అవినీతి ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుం టూ శాఖాపరమైన వేటుకు గురవుతున్నారు. దీంతో బెజ్జంకి ఠాణాలో నూతనంగా బాధ్యతలు చేపట్టడానికి ఉద్యోగులు వామ్మో బెజ్జంకి ఠాణానా అని బెంబెలేత్తుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మానకొండూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తలోగ్గి పలు ఒత్తిల్లకు లోనవుతూనే ఠాణా సిబ్బం ది విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. నూతన కమిషనరేట్ పరిధిలో 2019 నుంచి అక్టోబర్ 2022 వరకు నలుగురు రక్షక భటాధికారులు విధులు నిర్వర్తించగా ముగ్గురు పలు ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుని శాఖాపరమైన వేటుకు గురయ్యారు. ఇద్దరు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్ల్ పలు ఆరోపణలతో శాఖాపరమైన చర్యలకు గురయ్యారు.గత 30 ఏండ్ల క్రితం నిర్మించిన పోలీస్ స్టేషన్, సిబ్బంది నివాసాలు వాస్తు ప్రభావం వల్లే సిబ్బందికి ఉద్యోగ గండం ఏర్పడుతుందని స్థానికంగా పలువురు చర్చించుకుంటున్నారు.
గాడితప్పుతున్న బిన్నత్వంలో ఏకత్వం
సకల మత, కుల వర్గాలకు ప్రతికగా భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడికి నిదర్శనం భారత దేశం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల భారత దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పరిపాలన దేశంగా పేరుప్రఖ్యాతులు గడిచింది. దానికనుగుణంగానే ప్రజల చేత ఎన్నికైన పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు పరిపాలన సాగిస్తున్నాయి. పార్టీలకతీతంగా పరిపాలన సాగించాల్సిన ప్రభుత్వాలు చట్టాలను తమకనుగుణంగా మలుచుకుని ఇతర రాజకీయ పార్టీలపై పోలీస్ వ్యవస్థను అసరాగా చేసుకుని ప్రతాపం చూపుతున్నాయని, దానికనుగుణంగానే పోలీసులు కూడా విధిలేని పరిస్థితుల్లో పక్షపాత దోరణిని అవలంభిస్తూ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులకు ఒక న్యాయం, ఇతర రాజకీయ పార్టీల నాయకులకు మరోక న్యాయం అమలు చేయడం వల్ల అణచివేత దోరణిని అవలం భిస్తున్నారని పలువురు ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టే ఠాణాధికారిని మచ్చిక చేసుకోవడం కోసం కొందరు నాయకులు కొనసా గిస్తున్న శాలువాల సత్కరాలు కూడా ఠాణా సిబ్బంది ఉద్యోగా నికి గండంగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. పక్షపాత దోరణిని అవలంభిచకుండా నిష్పక్షపా తంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా విధులు నిర్వర్తిస్తే ప్రజల హృద యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని నూతనంగా బాధ్యతలు చేపట్టే ఠాణా సిబ్బందికి పలువురు విజ్ఞాన వంతులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు సూచిస్తున్నారు.