Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని విద్యుత్ అధికారులు
- ఆందోళన చెందుతున్న ప్రజలు
నవతెలంగాణ-అక్కన్నపేట
మండలంలోని గౌరవెల్లి గ్రామంలో విద్యుత్ వైర్లు చెట్ల కొమ్మలకు తాకి చాలా ప్రమాదకరంగా మారాయని, ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గౌరవెల్లి గ్రామస్తులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు .శుక్రవారం వారి సమస్యను విలేకరుల సమావేశంలో తెలి యజేశారు. గత కొంతకాలం నుంచి గ్రామం లోని గ్రామపంచాయతీ వద్ద ఉన్న విద్యుత్ వైర్లు చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయి ప్రమాదంగా మారా యన్నారు. ఇప్పటికే పలుమార్లు గ్రామ విద్యుత్ అధికారికి విన్నవించినా పట్టించుకోవడం లేద న్నారు. అంతేకాకుండా గ్రామంలో ఇంకా చాలా చోట్ల విద్యుత్ వైర్లు చెట్ల మధ్యలో ఉన్నాయని, నడిరోడ్డుపై ప్రమాదకరంగా ఒక విద్యుత్ స్తంభం ఉందని ఇప్పటికే దానివల్ల చాలామంది ప్రమాదానికి గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఏమి చేసేదూమి లేక విలేకరుల సమావేశంలో తమ సమస్యలు విన్నవించామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కళ్లెం లక్ష్మణ్, మంద రవి, చీకట్ల సత్యనారాయణ, బొజ్జపూరి వెంకటయ్య పాల్గొన్నారు.