Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డా.ఎస్ శ్రీదేవి
నవతెలంగాణ-సిద్ధిపేటరూరల్
వరిలో మోగి పురుగు ఉద్రి క్తం ఎక్కువగా ఉందని, రైతులు నివారణ చర్యలు చేపట్టాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిప తి డా.ఎస్. శ్రీదేవి సూచించారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు పండిస్తున్న వరి, మిరప పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. వరి గింజ గట్టిపడే దశలో ఉన్నాయని దాదాపుగా 30 శాతం వర కు మోగి పురుగు ఆశించిందన్నారు. దీని నివారణకు రైతులు ఈ దశలో ఎలాంటి పిచికారి చేయకూడదని చేసినా ఫలితం ఉండదన్నారు. ఆలస్యంగా పంట వేసిన రైతులు మాత్రం లీటరు నీటికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. లేదా లీటరు నీటికి క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. పిచికారి చేసుకోవాలని తెలిపారు. తరువాత యాసంగిలో రైతులు వరి నారు మడిలోనే నారు పీకే వారం రోజుల ముందు కార్బోఫ్యురాన్-3 జి గుళికలను వేయాలన్నారు. వరి నాటు వేసేటప్పుడు నారు కొనలను త్రుంచి వేయాలని తెలిపారు. ప్రధాన పొలంలో అయితే దుబ్బు చేసే దశలో కార్బోఫ్యురాన్-3 జి గుళికలను, అలాగే పంట చిరు పొట్ట దశలో ఉన్న ప్పు డు క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును లీటరు నీటికి 0.3 మి.లీ. పిచికారి చేయా లని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్వేత, సరిత, వ్యవసాయ విస్తరణ అధికారి టి.నాగార్జున, రైతులు మహేందర్రెడ్డి, నగేష్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.