Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల మండల పరిధిలోని తాడూరు గ్రామంలో అధిక సాంధ్రత పద్ధతిలో సాగు చేసిన పత్తి పంటలను డీఏవో శివ ప్రసాద్, ఏడీఏ రాధిక, ఏవో అఫ్రోజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ అధిక సాంధ్రతలో పత్తి సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. రైతులు మేపిక్వాట్ క్లోరైడ్ (చామత్కార్ ) మందును రెండు సార్ల పిచికారీ చేయడం వల్ల పెరుగుదల నియంత్రణలో ఉండి పూత, కాయలు ఒకే సమయానికి వచ్చి కాయ బరువు పెరు గుతుందన్నారు. దీని వల్ల మంచి దిగుబడులు వస్తాయన్నారు.140 నుంచి 150 రోజులు నవంబర్, డిసెంబర్లో పంట ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, నూజివీడు కంపెనీ ప్రతినిధులు నర్సింహరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రంజిత్ గజ్వేల్ రాజు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.