Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
గత నాలుగు రోజుల క్రితం నంగునూరు మండలంలోని గట్లమల్యాల-నాగసముద్రాల రోడ్డు మరమ్మతులలో భాగంగా రోడ్డు పనులు జరగక రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్ డిపో బస్సు సైతం నిలిపివేశారు. ఉదయం, సాయంత్రం గట్లమల్యాల మీదుగా నంగునూరు మండల కేంద్రంగా సికింద్రాబాద్ వరకు బస్సు ప్రయాణం కొనసాగుతుండేది. మోడల్ స్కూల్ ు సైతం బస్సు లేక విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో గట్లమల్యాల గ్రామ ప్రజాప్రతినిధులు స్పందించారు. సర్పంచ్ తిప్పని రమేష్, ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, వార్డ్ మెంబర్ రంగు వెంకన్నలు కలసి ప్రత్యేక చొరవతో గత రెండు రోజుల నుం చి కాంట్రాక్ట ర్తో సంప్ర దింపులు చే సి శుక్రవారం రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఈ రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు యధావిధిగా కొనసాగు తాయన్నారు. హుస్నాబాద్ డిపోబస్సు శనివారం నుంచి ప్రారంభ మవు తుందన్నారు. త్వరలోనే నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభ మవుతాయని పేర్కొన్నారు. తక్ష ణమే స్పందిం చినందుకు ప్రజలు, ప్రయాణికులు స్థానిక ప్రజాప్ర తినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ బుద్ధి రవి, బన్నీ పాల్గొన్నారు.