Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
సిద్దిపేటలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని సిద్దిపేట జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (బీజీడబ్య్లూ) జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ కార్మిక వర్గాన్ని కోరారు. సిద్దిపేట పట్టణ ంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ అనుబంధ సమావేశం జిల్లా అధ్యక్షులు చింతల వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ కార్మిక సమస్యలపై సీఐటీయూ అనునిత్యం పోరాడుతున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థ లను కాపాడాలంటూ పోరాటాలు చేస్తుందన్నారు. కార్మిక హక్కులను రక్షించాలని కోరుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షిం చాలని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు పరచాలని, దేశవ్యాప్తంగా అనేక సమస్యలు తీసుకొని కార్మిక వర్గ పక్షాన పోరాటాలు నిర్వహించి, అనేక సమ్మెలు నిర్వహించి ఫలితాలు సాధించి వాటి ఫలాలను కార్మిక వర్గానికి అందించిన కార్మిక వర్గ వేగుచుక్క సీఐటీయూ అని అన్నారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు అన్ని యూనియన్ల, సంఘాల కార్మిక ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అంది ంచాలని కోరారు. అలాగే జిల్లాలోని వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, సామాజికవేత్తలు, వ్యాపార వర్గాలు ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించి మహాసభల విజయ వంతానికి కృషి చేయాలని కోరారు. నరసింహులు, స్వామి, యాదగిరి, వెంకటయ్య, రాజు, కనక య్య, మల్లేశం పాల్గొన్నారు.