Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ విజయా ఖాదర్
నవతెలంగాణ-పటాన్చెరు
ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశా లున్నాయని, విద్యార్థుల అభిరుచికి తగ్గ విభాగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హౌమ్ సైన్స్ పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ ఖాదర్ అన్నారు. 'కనెక్ట్' ఉపన్యాసాల పరంపరలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ టర్నల్ రిలేషన్స్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు. విద్యార్థుల కెరీర్ ఎలా మలచుకోవాలి, పరిశోధనావకాశాలు, ఔషధ, రసాయన పరిశ్రమలలో ఫుడ్ సైన్స్, టెక్నాలజీ నైపుణ్యాలను ఎలా అన్వయిస్తారు అనే అంశాలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు. తాను హౌమ్ సైన్స్ బోధించేటప్పుడు ' వండుకోని, తినేదేగా' అని తోటి అధ్యాపకులే చులకన చేసిన సందర్భాలు ఉన్నాయని, తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఇష్టంగా పనిచేయడం ద్వారా రెండు మేథోహక్కులు, 86 పరిశోధనా పత్రాలు, ఆరు విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశ పుస్తకాలు, 22 పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి, ఎన్నో అవా ర్డులు, రివార్డులను పొందినట్టు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య డాక్టర్ విజయ సగర్వంగా ప్రకటించ ారు. ఫుడ్సైన్స్లో భద్రత, నాణ్యత నియంత్రణ, ఉత్పత్తుల అభివృద్ధి వంటి పలు విభాగాలున్నాయని, ఆయా విద్యార్థుల నేపథ్యం, అభిరుచికి తగ్గవాటిని ఎంపిక చేసుకుని రాణించాలని సూచించారు . ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యో గాలు చాలా తక్కు వగానే ఉన్నాయని, వృత్తిలో నైపుణ్యం సాధించిన వారికి విశ్వ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఓ ప్రశ్నకు ఆమె బదులిచ్చారు . తెలివిగా ఆలోచించగలిగితే ఈ రంగంలో స్వయం ఉపాధి చేపట్టి సులువుగా రాణించ వచ్చని డాక్టర్ విజయా ఖాదర్ స్పష్టీకరించారు. పూర్వకాల ంలో ఇళ్ళలో చేసుకునే ఉలవచారు ఈ రోజు ఐదు నక్షత్రాల హౌటళ్ళు, ప్రతిష్ఠాత్మక పెళ్లిళ్లలో మెనూగా మారిం దని, అలాగే పాలతాళికలు, కొబ్బరి / రాగి ఉండలు అని ఆమె వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లేక దాదాపు 30 శాతం వ్య వసాయ ఉత్పత్తులు ప్రతియేటా వృథాగా పోతున్నా యని, అంటే రమారమి రూ .580 కోట్ల విలువైనవని, అవి 23 కోట్ల మంది క్షుద్బాధను తీర్చగలవన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా అటు ఉత్పత్తుల వృథాను అరికట్టడమే గాక ఉపాధి అవకా శాలు, మహిళా సాధికారతను కల్పించవచ్చని డాక్టర్ విజ యా ఖాదర్ పేర్కొన్నారు . ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభా గాధిసతి ప్రొఫెసర్ ఉమామహేశ్వరి స్వాగతోపన్యాసం చేయ గా, కెరీర్ గైడెన్స్ సెల్ కు చెందిన కెరియల్ ఫుల్ఫిల్మెంట్ అధికారి డాక్టర్ రమాకాంత్ బాల్ వందన సమర్పణ చేశారు. డాక్టర్ అజయ్‌కుమార్ స్వర్ణాకర్, డాక్టర్ జి.నిహారిక, అధ్యాప కులు, విద్యార్థులు ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పాల్గొన్నారు.