Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
నవతెలంగాణ-పుల్కల్
గ్రామాల్లో నెలకొల్పిన పల్లె ప్రకృతి వనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని సుల్తా న్పూర్ గ్రామంలో గల పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ పల్లె ప్రకృతి వనాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ పల్లె ప్రకృతి వనంలో ప్రజలకు కూర్చోవడానికి కుర్చీలు అలాగే డ్వాక్రా సంఘాల సభ్యులతో టీ కొట్టు ఏర్పాటు చేసే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల పట్ల ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించిన సహించేది లేద న్నారు. ప్రతి పల్లె ప్రకృతి వనంలో అన్ని రకాల మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి గ్రామ సర్పంచులపై ఎంతైనా ఉందన్నారు. సుల్తాన్పూర్ పల్లె ప్రకృతి వనాన్ని చూసి ఆయన అభినందించారు. ఈ పల్లె ప్రకృతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఇలాంటి వనాలను పెంచా లన్నారు. పుల్కల్ ఎంపీడీవో మధులత, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, జిల్లా గ్రామీణ అభి వృద్ధి అధికారి శ్రీనివాసరావు, డీపీఓ సురేష్ మోహన్, మండల ప్రత్యేక అధికారి వామన్రావు, ఆర్డీవో అంబాదాస్, డీఎల్పీఓ సంతోష్ రెడ్డి, తహసిల్దార్ కిష్టయ్య, ఏపీవో సంతోష్ ఈసీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.