Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుమ్మడిదల
మండలంలోని అన్నారం, గుమ్మడిదల, కానుకుంట, రాంరెడ్డి బారు, నల్లవల్లి, కొత్తపల్లి, తదితర గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మండల ప్రజా ప్రతిని ధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దళారుల వ్యవస్థను రూపుమాపటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభి స్తున్నదన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చేలా.. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్ తహసిల్దార్ సుజాత, ఎంపీటీసీలు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, బ్యాగారీ లక్ష్మి, సర్పంచ్ తిరుమల వాసు, ఉప సర్పంచ్ మేడిపల్లి మురళి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్స్ దేశబోయిన శ్రీని వాస్, గోకర్ జయశంకర్ గౌడ్, మండల వ్యవసాయ అధికా రి శ్రీనివాసరావు, రుక్మారెడ్డి, మండల వ్యవసాయ సహ కార సంఘం చైర్మెన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.