Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ జహీరాబాద్
కార్పొరేట్ కళాశాలలో లక్షలు వెచ్చించి రాత్రింబవళ్లు కష్టపడి విద్యార్థులు సాధించిన ర్యాంకులకు దీటుగా.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం హర్షించ దగ్గ విషయమని డీఎస్పీ వి. రఘు అన్నారు. శుక్రవారం స్థానిక షట్కార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి డీఎస్పీ పాల్గొన్నారు. వివిధ సబ్జెక్టుల్లో రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ కపులతో పాటు కళాశాల యజమాన్యం బంగారు రింగులను బహూకరిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లా డుతూ.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యనభ్యసించే వారు మాత్రమే ర్యాంకులు సాధించగలుగుతారన్నారు. కష్టపడే విద్యార్థులకు తన వంతు సహకారం అందించ ేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నేడు ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎన్నో రకాల ఉద్యోగాలు లభిస్తున్నాయని.. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ శాఖ అనుసంధానంతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇస్తునదన్నారు. కళాశాల యజమాన్యం విద్యార్థిని విద్యార్థుల మధ్య పోటీని పెంచేందుకు బంగారు బహుమతులను అందించడం ఎంతో హర్షించదగ్గ విషj ుమన్నారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చేందుకు యజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని కళాశాలలోని అందరు విద్యార్థులు వినియోగిం చుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేరాల అదుపునకు అందరు సహకరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శాంత కుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల యజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులందరి కృషి కారణంగానే నేడు ఇన్ని ర్యాంకులు సాధించగలిగినామన్నారు. కళాశాల నిర్వా హకులు శివన్న, సిద్దన్న డైరెక్టర్లు కృష్ణ చైతన్య మహేష్ మజ్జి గలు మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతంలో విద్యార్థిని విద్యార్థులకు తమ కళాశాల ఎన్నో అవకాశాలను కల్పిస్తున్న దని.. వాటన్నింటిని వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. కిరణ్ కుమార్, సదారం, మక్షుత్, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు మహబూబ్ అలీ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.