Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి గీతారెడ్డి
నవతెలంగాణ-పుల్కల్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి గీతారెడ్డి పిలుపుని చ్చారు. ఎంఎన్ఆర్ చౌరస్తా నుంచి శివంపేట గ్రామం వరకు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల మూడో తేదీన ఆందోల్ నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు సంబంధించిన పనులను పరిశీ లించామన్నారు. శివంపేట గ్రామంలో పాదయాత్ర సభ స్థలాన్ని పరిశీలించామన్నారు. అక్కడి నుండి నేరుగా సుల్తా న్పూర్ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అక్కడే రాత్రి బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఎప్పటికప్పుడు పాదయాత్ర కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. పుల్కల్ ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పాదయాత్రను విజయవంతం చేయాల న్నారు. కార్యక్రమంలో శివంపేట గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ నత్తి దశరథ్, వెండికొల్ సర్పంచ్ పల్లవి జై రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాం చంద్రారెడ్డి, శివంపేట ఎంపీటీసీ కిరణ్ గౌడ్, చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.