Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరపాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
నవతెలంగాణ-హత్నూర
పత్తికి క్వింటాకు రూ.12వేల మద్దతు ధర నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బోర్పట్ల గ్రామంలో తెలంగాణ రైతు సంప ˜ుం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. పత్తి పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పత్తి పంట సాగు, దిగుబడి దగ్గి పోయినా భారత దేశంలో మాత్రం పత్తి ధర పెరుగుదల లేదన్నారు. గత సంవత్సరం వ్యవసాయ సీజన్లో బహిరంగ మార్కెట్లో పది, పదకొండు వేల రూపాయల ధర ఉందని ప్రస్తుతం ఆరువేలు కూడా లభించడం లేదన్నారు. పత్తి పంట సాగు ఖర్చులు విపరీ తంగా పెరిగిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి పంట మద్దతు ధర క్వింటాకు పన్నెండు వేల రూపాయల ప్రకటించి కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరారు. వచ్చే నెల 6న సంగారెడ్డి లో జరిగే జిల్లా రైతు సంఘం మహాసభలు జయప్రదం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామాంజనేయులు,గంగా రెడ్డి,నాగార్జున రెడ్డి, రామకృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.