Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండాపూర్
గ్రామపంచాయతీ కార్మికుల (సీఐటీయూ) అనుబంధ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలంటూ కొండాపూర్ సీఐటీయూ మండల కార్యాల యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ ్యక్షులు ఎస్.బాబురావు మాట్లాడుతూ.. ఈ మహాసభలు నవంబర్ 26,27, తేదీల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు రెండ్రోజులపాటు జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ వేదికగా చర్చలు నిర్వహించి.. భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్న దని ఆరోపించారు. వారితో వెట్టి చాకిరి చేయించుకుంటూ, చాలీచాలని వేతనాలతో ఊడిగం చేయిస్తున్నదన్నారు. వారికి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ వరకు విధానాన్ని రద్దు చేయాలని, జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రాతిపదికన గ్రామ పంచాయతీ కార్మికులను నియమించాలన్నారు. ఈ రాష్ట్ర మహాసభల వేదికగా పలు తీర్మానాలను కూడా రూపొం దిస్తామన్నారు. మండల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.