Authorization
Wed April 09, 2025 05:37:15 am
- మహాసభలకు విరివిగా విరాళాలు ఇవ్వండి
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య
నవతెలంగాణ-పటాన్చెరు
కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతర పోరాటం చేస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో కిర్బి పరిశ్రమలో సీఐటీయూ మహాస భల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 21, 22 ,23 తేదీల్లో సిద్దిపేట పట్టణంలో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరా డుతున్న సంఘం సీఐటీయూనే అన్నారు. విరాళాలు ఇవ్వట ంతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. జనరల్ సెక్రెటరీ వి.ఎస్ రాజు, టి శ్రీని వాస్, సుధాకర్, ఏడుకొండలు, లఖాన్, లక్ష్మణ్, శ్యామ్, విఠల్, శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.