Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
రాష్ట్ర ఉమెన్ సేఫ్టీవింగ్ సూచనల మేరకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆదేశానుసారం జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు శనివారం సైబర్ నేరాల గురించి మండల పరిదిలోని మునిగడప గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహణ కల్పించారు. గజ్వేల్ షీ టీమ్ అధికారులు సిబ్బంది కలిసి సైబర్ నేరాలపై అవగాహణ కల్పించారు. గజ్వేల్ షీటీమ్ ఏఎస్ఐ అమత్, సిబ్బంది మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకుకు సంబంధించిన వివరాలు, ఓటీపీ తదితర నెంబర్లు ఎవరికీ తెలియపరచ కూడదన్నారు. వాట్సప్‌లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్‌లను క్లిక్ చేయకూడదని సైబర్ నేరం జరిగిన వెంటనే ఎంసీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, 112 లకు కాల్ చేయాలన్నారు. లాటరీ తలిగిందని బంపర్ ఆఫర్ కార్లు, మోటార్ సైకిల్ వచ్చాయని సైబర్ నేరగాళ్లు పంపే ఎస్ఎంఎస్లకు ఆశపడి డబ్బులు పంపించి మోసపోవద్దన్నారు. సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలన్నారు. సైబర్ నేరాల్లో మీరు డబ్బులు పొగొట్టుకున్నారా వెంటనే లేదా, 24 గంటల లోపు ఫిర్యాదు చేస్తే డబ్బులు 99% రికవరీ, తదితర అంశాల గురించి అవగాహణ కల్పించారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, పోక్సో చట్టం, బాల్య వివాహాల, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, షీటీమ్ యొక్క ప్రాముఖ్యత ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తదితర అంశాల గురించి వివరించారు. పోక్సో, బాల్య వివాహాల చట్టాల గురించి వివరించారు. సైబర్ క్రైమ్, షీ టీమ్స్, ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, తదితర అంశాలు, చట్టాలు, భరోసా సెంటర్లో అందిస్తున్న సేవల గురించి విద్యార్థినిలకు వివరించారు ఏదైనా అవసరం ఉంటే డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8333998699, లేదా షిటీమ్ వాట్సప్ నెంబర్ 7901640473 ఫోన్ చేయాలన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో షీటీం ఏఎస్ఐ అమృత్, స్కూల్ హెడ్మాస్టర్ రహీమ్, 350 మంది విద్యార్థినీ విద్యార్థులు షీటీమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, మహిళ కానిస్టేబుల్ జ్యోతి, కానిస్టేబుళ్లు యుగేందర్, అన్వేష్ తదితరులు ఉన్నారు.