Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-కొండపాక
మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామం వేములఘాట్ వాసులకు మిగిలిన పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపు, ఆర్అండ్ఆర్ కాలనీలలో మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలన్నింటినీ చట్టప్రకారం పరిష్కరించి నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమీకృత సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్వాసులు నివసిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మల్లన్నసాగర్ నిర్మాణం సందర్భంగా భూమిని, ఊరిని, ఇళ్లను కోల్పోయి ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు. కోర్టు కేసు వల్ల ఆగిన ప్యాకేజీల గురించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత పరిష్కారిస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డులో ఓపెన్ ప్లాట్లు కోల్పోయిన వారికి వేరే ప్రదేశంలో ప్లాట్లు ఇస్తామని హామీనిచ్చారు. సందర్భంగా వేములఘట్ ఇతర గ్రామాల ప్రజలలో కొంతమంది కోల్పోయిన నష్టపరిహారం, ప్లాట్ల కేటాయింపు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఆర్ అండ్ ఆర్ కాలనీలలో గుడి, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీరోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ పైప్‌లైన్, ఎలక్ట్రిసిటీ స్తంభాలు, వీధిలైట్లు ఇతర సమస్యలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా పూర్తి చేయాలని నిర్మాణం ప్రారంభమైన పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అత్యవసర పనులను ముందుగా పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి, వేములఘాట్ గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.