Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్ధిపేటరూరల్
పయనీర్ కంపెనీ విత్తనాలు వాడడం వల్ల రైతులు అధిక దిగుబడి పొందవచ్చని పయనీర్ కంపెనీ సేల్స్ అధికారి భీంరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని బుస్సాపూర్ గ్రామంలో కార్డెవా అగ్రిసైన్స్ కంపెనీకి చెందిన పయనీర్ బ్రాండ్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం పి.3401 రకం విత్తనాలు పండించిన రైతు మద్దూరి ఎల్లయ్య పొలంలో గ్రామంలోని రైతులతో ఫీల్డ్ ప్రదర్శన నిర్వహించారు. పి.3401 రకం ఎకరం పొలంలో 30-35 కింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అధిక దిగుబడి పండించిన రైతు ఎల్లయ్యను శాలువతో సన్మానించారు. అదేవిధంగా గ్రామంలో పండిస్తున్న పంటల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు పంట దిగుబడి చూసి ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం వర్షాధా రంగా పయనీర్ పీ3401 మాత్రమే సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ స్టాఫ్ గణేష్, భానుప్రకాశ్, మహేష్ రైతులు పాల్గొన్నారు.