Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేటరూరల్
ఆయిల్ ఫామ్, మల్బరీ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్రావు అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తౌటి ఉదయశ్రీ తిరుపతి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ఫామ్, మల్బరీ సాగు చేయడానికి రాష్ట్రప్రభుత్వం రైతులకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ మల్బరీ సాగు చేయాలని సూచించారు. పీఎం కిసాన్ పథకం కోసం రైతులు ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పరశురామ్రెడ్డి, హార్టికల్చర్ అధికారి బాలాజీ, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు మోహన్‌రెడ్డి, సెరికల్చర్ అధికారి మల్లయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.