Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ మిరుదొడ్డి
మాలల ఐక్యత సంఘ నిర్మాణం, రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెన్నె రాజు అన్నారు. శనివారం మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామానికి చెందిన యాదగిరికి మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మండల యాదగిరిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలను ఐక్యత చేసి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సంఘ నిర్మాణం బలోపేతం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయడానికి మాలలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన మండల యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ దుబ్బాక మాజీ ఎంపీపీ శ్రీరాములు, జిల్లా అధ్యక్షుడు వెన్నరాజుతోపాటు రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, దుబ్బరాజంతో పాటు తదితరులు పాల్గొన్నారు.