Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు గెజిట్నోటిఫికేషన్ జారీ
- మెదట్ ఉమ్మడి జిల్లాలో తొలుత 73 గ్రామాలు
- తాజాగా 61 గ్రామాల్లోనే భూసేకరణ
- నాలుగు వరసల రోడ్డు నిర్మాణం
- ఎనిమిది వరసల కోసం భూసేకరణ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
త్రిపుల్ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ మారింది. తొలుత ప్రతిపాదించిన గ్రామాల్లో కొన్ని తగ్గాయి. మారిన అలైన్మెంట్తో అదనపు గెజిట్నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రస్తుతం నాలుగు వరసల రోడ్డు నిర్మాణం చేయనున్నారు. భవిషత్ అవసరాల నిమిత్తం ఎనిమిది వరసల రోడ్డు నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించాలని గెజిట్నో టిఫికేషన్‌లో పేర్కొన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. మొదట్లో జారీ చేసిన గెజిట్నోటిఫిరేషన్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉత్తర భాగం యాదాద్రిభువనగిరి జిల్లా రాయగిరి నుంచి మొదలవుతోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ నుంచి గజ్వేల్ రెవెన్యూ డివిజన్లోని పలు గ్రామాల మీదుగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్, తూప్రాన్ రెవెన్యూ డి విజన్లలోని గ్రామాల మీదుగా సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, ఆందోల్-జోగిపేల డివిజన్లలో భూ సేకరణ చేయనున్నారు. ఉత్తర భాగం త్రిపుల్ఆర్ 162.46 కిలో మీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఉత్తర భాగం పరిధిలో వంద మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం నాలుగు వరసల రోడ్డు నిర్మాణం చేస్తారు. భవిషత్లో ఎనిమిది వరసల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంటది. జాతీయ, రాష్ట్ర రహదా రులు, ఇంటర్ ఛైంజర్ల నిర్మాణం రిత్యా ఎనిమిది వరసల రో డ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేస్తు న్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 14 మండలాల్లో త్రిపుల్ఆర్ నిర్మాణం జరగనుంది. మొదట్లో 73 గ్రామాల్ని భూసేకరణ కోసం గుర్తించారు.
రెవెన్యూ డివిజన్ల వారీగా..
త్రిపుల్ఆర్ భూసేకరణ కోసం గెజి ట్నోటిఫికేషన్లో ప్రతిపాదిం చిన గ్రామాల ఖరారయ్యా యి. సిద్దిపేట, మెదక్, సంగా రెడ్డి జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 61 గ్రామాలను చేర్చారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బేగంపేట, యా ల్కర్, బంగ్లావెంకటాపూర్, నెమ్టూరు, మఖత్మాసా న్పల్లె, జబ్బాపూర్, మైలారంమక్తా, సంగాపూర్, ముట్రాజ్ పల్లె, ప్రజ్ఞాపూర్, పాములపర్తి, చేబర్తి, అంగడికిష్టాపూర్, ఎర్రవల్లి, అత్రాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె ఉన్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నాగులపల్లె, మూసాపేట, జనకంపేట, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, ఖాజీపేట్, తిర్మల్పూర్, తుజాల్పూర్, లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతులబోగూడ, గుండ్లపల్లి, కాంతన్పల్లె గ్రామాలున్నాయి. తూప్రాన్ డివిజన్ పరిధిలో వట్టూరు, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాంతర్పల్లె, గుండారెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంటకాయపల్లె, నర్సంపల్లె ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి డివిజన్ పరిధిలో మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, ఇరిగిపల్లె, చింతపల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాండ్లపల్లి, కులబ్గూర్, కాసాల, దేవల్‌పల్లె, సికిందర్‌పూర్, దౌల్తాబాద్ కొత్తపేట గ్రామాలున్నాయి. ఆందోల్-జోగిపేట డివిజన్ పరిధిలో శివంపేట, వెండికోల్, అంగడికిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోర్ గ్రామాలున్నాయి.
అదనపు గెజిట్‌లో 4942 ఎకరాలు
త్రిపుల్ఆర్ కోసం ఉత్తర భాగంలో 4942 ఎకరాలు అవసరమని ఇటీవల జారీ చేసిన అదనపు గెజిట్ నోటిఫికేషన్లో ప్రాథమికంగా పేర్కొన్నారు. ఎనిమిది వరసల రోడ్డు నిర్మాణం కోసం సరిపడ భూముల్ని సేకరించాలని అందులో ఉంది. వాస్తవంగా త్రిపుల్ఆర్ నాలుగు వరసలతోనే నిర్మిస్తారు. అందుకు సరిపడ బడ్జెట్‌నే కేటాయించారు. కానీ..! భవిషత్లో ఎనిమిది వరసలుగా విస్తరించేందుకు గాను ఇప్పుడే భూముల్ని సేకరిస్తున్నారు. మొదట జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఉత్తర భాగంలో 4200 ఎకరాలు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. తాజా మాత్రం 4638 ఎకరాలు అవసరమని గుర్తించారు. సవరించిన గెజిట్‌లో మాత్రం 4942 ఎకరాలు అవసరమని పేర్కొన్నారు. అంటే భూ సేకరణ పెంచుతూ పోతున్నారు. ఉత్తర భాగంలో మొదట్లో అలైన్‌మెంట్‌కు రెండు వైపులా అరకిలో మీటర్ పరిధిలో 122 గ్రామాల్ని గుర్తించారు. తాజా గెజిట్‌లో మాత్రం 84 గ్రామాల్లే గుర్తించారు. గ్రామాల సంఖ్య తగ్గినప్పటికీ భూముల సేకరణ మాత్రం తగ్గలేదు. నాలుగు వరసల రోడ్డుకు సరిపడ భూముల్ని మాత్రమే సేకరించాలని రైతులు కోరుతున్నారు. ఎప్పుడో నిర్మించే ఎనిమిది వరుసల రోడ్డుకు ఇప్పుడు భూములు తీసుకోవడం వల్ల తాము నష్టపోతామని పేర్కొంటున్నారు. భూములకు ప్రస్తుత పరిహారమే ఇచ్చి సేకించడం వల్ల నష్టపోతామన్నారు.