Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ సురేష్ షేట్కార్
నవతెలంగాణ-మనూర్
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర చారిత్రాత్మకమని.. ఈ పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, జోడోయాత్ర కన్వీనర్, మాజీ ఎంపీ సురేష్ షేట్కర్ పిలపునిచ్చారు. మనూర, నాగిలిగిద్ద మండల కేంద్రాల్లో శనివారం కో కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవచారి, మానుర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ పటేల్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు.. ప్రజల కష్టాలు తెలుసు కోవడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారన్నారు. ఈ యాత్రకు మంచి స్పందన లభించిందన్నారు. కాగా వచ్చే నెలలో ఈ యాత్ర సంగారెడ్డి జిల్లాలో అడుగుపెడుతున్నదని.. ఇక్కడి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు. వచ్చే నెల 6న పెద్దశంకరంపెట్ మండలంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉంటుందన్నారు. అంతకుముందు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కర్, పీసీసీ సభ్యులు శంకరయ్య, స్వామి కలిసి భారత్ జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ కొ-ఆప్షన్ సభ్యులు రషీద్, ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మెన్ శ్రీకాంత్, నాగ్ శెట్టి అడ్వకేట్, బొరంచ్ నారాయణ మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ నిరంజన్, మల్లికార్జున్ పటేల్, లింగప్ప పటేల్ బాధల్ గమ,పండరి రావు ఎల్గోయి, సంగారెడ్డి మాజీ సర్పంచ్ తోర్నల్,విద్య సాగర్ అతిమ్యాల, పాషా,రంలు డైరెక్టర్,సాగర్ మాజీ ఎంపీటీసీ, నర్షిహ రెడ్డి, ఎన్జీ హుక్రన, యుత్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి బెల్లపుర్, ఉమకంత్,రఘురాం పటేల్, శేరే సంగన్న, గంగయ్య స్వామి, సుబ్బన్న, రవి గౌడ్, జగనత్ దుదగొండ,శంకరప్పా దన్వర్, పండరి రావు, వెంకట్రెడ్డి, గౌస్, అసం అలీ, తిరుపతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.