Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రఘు సూచించారు. శనివారం ఉదయం జహీరాబాద్ పట్టణంలోని ఫయాజ్ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధూపత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, 2, ఆటోలను స్వాధీనపరచుకున్నట్టు తెలిపారు. అనంతరం కాలనీవా సులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడు తూ.. నేరాల అదుపునకు తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పరిచయం లేని, ధ్రువపత్రాలు లేని కొత్త వ్యక్తులకు ఇండ్లను అద్దెకు ఇవ్వొద్దన్నారు. ఎవరైనా నూతన వ్యక్తులు కాలనీలో సంచరిస్తే వెంటనే పోలీసులకు కానీ 100 నెంబర్కు గానీ సమాచారం ఇవ్వాలన్నారు. నేరాల అదునపు ప్రతీ కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వాటి ఆధారంగానే ఎన్నో నేరాలను కూడా చేధించడం జరుగుతున్నదన్నారు. మంచి వ్యక్తులకు పోలీ సులు ఎల్లవేళలా సహకరిస్తారు.. సలహాలు ఇస్తారని సూచి ంచారు. సీఐ తోట భూపతి, ఎస్సైలు శ్రీకాంత్ ,పరమేశ్వర్, సురేష్, నర్సింలు, అంబాజీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.