Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెడ్పి చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబం ధించి ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జడ్పీ సమావేశంలో ప్రజా ప్రతిని ధులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని, నామ మాత్రపు నివేదికలు ఇవ్వొద్దన్నారు. ఆయా శాఖల అధికారుల పరిధిలో చేయాల్సినవి వేగవంతంగా చేయాల న్నారు. జాప్యం చేయొద్దని, ప్రభుత్వానికి పంపాల్సి ఉంటే వెంటనే పంపాలని తెలిపారు. నిర్మాణాత్మక రీతిలో సరియైన సమాధానం ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సమ స్యలను లేవనెత్తారని, వాటిని పరిష్కరించడంలో ఆయా అధికారుల పరిధిలో చేయాల్సినవి చేయాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ అధికా రులు వ్యక్తిగతంగా ప్రత్యేక దష్టి సారించి పరిష్కరిం చాల న్నారు. ఆయా శాఖల అధికారులు క్షేత్ర పరిధిలో స్వయంగా పరిశీలించాలన్నారు. తదుపరి జడ్పీ సమావేశంలో గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై తీసుకున్న చర్యలను సభ్యులకు వివరించాల్సి ఉంటుందన్నా రు. ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను నవం బర్ 20 లోగా తమకు సమర్పించాలని కలెక్టర్ సూచిం చారు. మండల స్థాయి సమావేశాలకు మండ ల స్థాయి అధి కారులు విధిగా హాజరు కావాలని, ఆయా శాఖల జిల్లా అధికారులు మండల సమావేశాలలో పాల్గొన డానికి చొరవ చూపాలన్నారు. ఈ సమీక్షలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాజార్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డిఆర్డిఓ, వ్యవసాయ, పంచాయతీరాజ్ ఇంజనీ రింగ్ విభాగం, ఆర్అండ్బి, విద్య, వైద్యఆరో గ్యం, ఇరిగేషన్, గిరిజన, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.