Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి
నవతెలంగాణ-నిజాంపేట
నారుమడి సిద్ధం చేసుకునే ముందు మెలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చని జినేక్స్ సీడ్ కంపెనీ రీజినల్ మేనేజర్ కోటి రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో ఆదివారం జీనేక్స్ సీడ్స్ ఇండియా వారి సౌజన్యంతో జీపీహెచ్ 699 వరి రకానికి సంబంధించి అవగాహన కల్పించారు. జీపీహెచ్ 699 వరిని కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అతని సొంత వ్యవసాయ భూమిలో 12 ఎకరాలలో సాగు చేశారు. దీంతో అధిక దిగుబడి రావడంతో జినేక్స్ సీడ్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలలోని దాదాపు 400 మంది రైతులతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రైతు సంగారెడ్డిని జినెక్స్ సీడ్స్ సంస్థ ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ జినేక్స్ సీడ్స్ ద్వారా జిపిహెచ్ 699 దొడ్డు రకం వరి సాగు చేయడంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటల్లో వచ్చే పురుగులు, దోమల మచ్చలు, తెగుల గురించి రైతులు నష్టపోకుండా సలహాలు సూచనలను తెలియజేశారు. జీపీహెచ్ 699 వరి రకం ఎగరానికి దాదాపు 35 నుంచి 40 క్వింటాళ్లు వస్తుందని రైతులకు తెలిపారు. జినేక్స్ సీడ్స్ మొక్కజొన్న, పత్తి, వివిధ రకాల విత్తనాలు లభిస్తాయని రైతులకు జినేక్స్ సీడ్స్ కంపెనీ రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమన్నగారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి, ఏరియా ఆపీసర్సు నవీన్, బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.