Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ-రేగోడు
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైందని అందోల్ నియోజక వర్గంలో సింగూరు జలాలు, జేఎన్టీయూ కాలేజ్, వట్పల్లి మార్కెట్ యాడ్‌తో పాటు మరెన్నో అభివృద్ధి పనులు జరిగాయని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. శనివారం రేగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. మళ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన తెలిపారు. వచ్చే నెల 3న నియోజకవర్గంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ వినీల, జెడ్పీటీసీ యాదగిరి, పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దిగం బర్ రావ్, కోఆప్షన్ సభ్యులు చోటు బాయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ నాగిరెడ్డి, డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, నాయకులు, కల్లేటి శ్రీధర్ గుప్త, చిదిరే కృష్ణ, సంఘీ లింగం తదితరులు పాల్గొన్నారు.