Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సాపూర్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల పరిధిలోని పిప్పల్ పాడ్ గ్రామ ఎనగంటి తండాలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ చేపడుతున్న ప్రచారానికి గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, నాయకులు అమర్ సింగ్, రమణ గౌడ్లు ఉన్నారు
ఆత్మకమిటీ డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయులు
నవతెలంగాణ-కొల్చారం
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ 25 వేల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆత్మకమిటీ డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయులు అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం పిపాల్పహాడ్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితోకలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నిరంతరం కృషిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా స్వయంగా ఇంటిటికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, దళిత బంధు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, గ్రామాల అభివృద్ధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల గురించి వివరించడం జరుగుతుందన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరినట్లు ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్, శ్వపతి తదితరులు పాల్గొన్నారు.