Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దశంకరంపేట్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాసులు అన్నారు. ఆదివారం పెద్దశంకరం పేట పరిధిలోని రాహుల్ గాంధీ ప్రయాణించే రూట్ మ్యాప్‌ను వారు పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ ఆరవ తేదీన పెద్దశంకరంపేట మండల పరిధిలోని కోలాపల్లిలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ప్రారంభమవుతుందని కమలాపూర్ వరకు కొనసాగుతుందన్నారు. యువకులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని వారు పేర్కొన్నారు. పేట మండల పరిధిలోని కమలాపూర్ వద్ద రాహుల్‌గాంధీ బస చేయనున్నారన్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్ మండల కాంగ్రెస్ నాయకులు రాయిని మధు, జహంగీర్, భాను పాల్గొన్నారు.