Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
నవతెలంగాణ-అక్కన్నపేట
అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ చిలుపూరి రాజిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని, ఆయన మరణం గోవర్ధనగిరి ప్రజలకు, పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఆదివారం ఆయన పార్థివదేహానికి సీపీఐ జెండా కప్పి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ చిలుపూరి రాజిరెడ్డి ఉన్నత భూస్వామ్య కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్లో పని చేసి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఆయనతో పాటు సీపీఐ మాజీ నాయకులు పెండల ఐలయ్య, సీపీఐ నాయకులు గడిపే మల్లేష్, కొమ్ముల భాస్కర్, కొయ్యడ కొమురయ్య, యెడల వనేశ్, జేరిపోతుల జనార్దన్, సంగెం మధు, మంద శ్రీను, బెక్కంటి సంపత్, సుదర్శన చారి, సంజీవరెడ్డి, మెడవేని సారయ్య, దాసారం పరుషరాములు, రాజ్ కుమార్, యాద పద్మ తదితరులు ఉన్నారు.