Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు
- ప్రత్యేక ఆకర్షణగా వివిధ రకాల స్టాళ్లు
నవతెలంగాణ-రామచంద్రాపురం
రామచంద్రపురంలోని భేల్ టౌన్షిప్లో గల భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్లో శనివారం సాయంత్రం మిలాప్ స్నేహ సమ్మేళనం 2022 ని వైభవంగా నిర్వహించారు. సమ్మేళనంలో భాగంగా విద్యార్థులు ఆటలు, తినే పదార్థా లతోపాటు, వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఈ మేళాను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భవన్ హైదరాబాద్ కేంద్ర వైస్ చైర్మెన్ గోపాలకృష్ణన్, భేల్ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాలలో నైపుణ్యం అవసరమన్నారు. భవన్స్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నారన్నారు. విద్యార్థులలో స్నేహభావం మంచి భావాలు కలిగేందుకు ఇలాంటి మేళా కార్యక్రమాలు ఎంతగా నో ఉపయోగపడతాయన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉమా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహ సమ్మేళనాన్ని తమ పాఠశాలలో అందరి సహాయ సహకారాలతో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ మేళా కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా మేళాలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శన అక్కడికి వచ్చిన వేలాదిమంది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భేల్ చుట్టుపక్క ప్రాంతాలకు చెందిన అనేకమంది వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో రాత్రి పొద్దు పోయేదాకా గడిపారు. అనంతరం బంపర్ డ్రా లో వచ్చిన విజేతలకు అతిథులు బహుమతుల ప్రదానం చేశారు. సుమారు వందకి పైగా వివిధ రకాల స్టాళ్లను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కలకు చెందిన అన్ని రంగాల ప్రజలు ఎంతగానో ఆసక్తి చూపుతారు.