Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆర్థిక సహకారంతో సాకి చెరువుకట్టపై పూజా ఏర్పాట్లు
- నేడు పట్టణంలో మైత్రి మైదానంలో భారీ జాగరణ
- ముఖ్య అతిథిగా పాల్గొననున్న భోజ్‌పూర్ నటుడు కేసరి లాల్ యాదవ్
నవతెలంగాణ-పటాన్చెరు
విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నెలవై మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమార్, ఉత్తర భారతీ యుల అసోసియేషన్ ప్రతినిధి సందీప్ షాలతో కలిసి ఆయ న మాట్లాడారు. నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆర్థిక సహ కారంతో చట్ పూజ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. సాకి చెరువు కట్టపై ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్వహించనున్న పూజల సందర్భంగా ప్రత్యేకంగా ఘాట్లు, లైటింగ్, మంచినీరు, గజ ఈతగాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని మైత్రి మైదా నంలో భోజ్ నటుడు కేసరి లాల్ యాదవ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్ర మానికి పటాన్చెరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.