Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు. ఆదివారం ఆయా రంగంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నాయని.. కనీస వేతనం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కనీస వేతనం అమలు కోసం పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కార్మికులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబరులో జరిగే మహాసభల నాటికి ప్రభుత్వం స్పందించాలని.. లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర మహాసభలను కార్మికులంతా జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సీఐటీయూ అందోల్ మండల కార్యదర్శి విద్యా సాగర్, నాయకులు రాములు ప్రభాకర్ రాజు, సీఐటీ యూ పుల్కల్ మండల కార్యదర్శి కృష్ణ, రైతు సంఘం నాయ కులు రాజు, మల్లయ్య, అరుణ, సేకమ్మ, ఇందిరా పాల్గొన్నారు.