Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్హేర్
పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ రాఘవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆదేశానుసారం సిర్గాపూర్ మండల ంలోని అంతర్గాం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో.. కనీస మద్దతు ధరను కల్పించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న దన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2040 ఇస్తున్నదన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొ ద్దని చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద న్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులు సర్పంచ్, జెడ్పీటీసీని శాలువాతో సన్మానించారు. పీఏసీఎస్ చైర్మెన్ గుండు వెంకటరాములు, సర్పంచ్ రవి పటేల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.