Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లలో రూ.50 లక్షల కోట్లకుపైగా అప్పు తెచ్చిన కేంద్రం
బీఆర్ఎస్తో బీజేపీ వణుకు
- సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-కౌడిపల్లి
ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటును రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సర్పంచ్ల పోరం మండల అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నవతెలంగా ణతో మాట్లాడుతూ.. 'కొన్ని రోజులుగా బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం బీజేపీ నాయకుల నీచ రాజకీయాలకు నిదర్శనం' అని అన్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేస్తామన్న మాట నిలబెట్టుకోకపోయారని అన్నా రు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచితే బీజేపీ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేశారని, ప్రస్తుతం బీజేపీ రోజువారీగా రేట్లు పెంచుతూ వాహనదారుల నడ్డి విరుస్తోందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200పైగా పెంచిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఆదానీ, అంబా నీలకు రూ.12 వేల కోట్ల మాఫీ చేయించి కార్పొరేట్ శక్తులను పెంచుతున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతుబీమా, రైతుబంధు, దళితబంధు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలను ఆదుకుం టున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రతి కుటు ంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా రూ.50 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిందని కాగ్ నివేదిక చెబుతోందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు. జీఎస్టీ తో పేదల కడుపు కొడుతోం దన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేసి ప్రజల మోసం చేశారని ఆరోపిం చారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గెలిచి సంవత్సరంపైగా అవుతున్నా కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.