Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి విజయనిర్మల సూచించారు. పెద్ద శంకరంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. పేట ఆసుపత్రిలోని ప్రసూతి గది, వ్యాక్సిన్ గది, ల్యాబ్, నూతన భవనాన్ని ఆమె పరిశీలించారు. గ్రామాలలో సబ్ సెంటర్లలో మందులు ఉన్నాయా లేదా అని సిబ్బందిని వివరాలు అడిగి తెలు సుకున్నారు. పెద్ద శంకరంపేట మండల వైద్యాధికారిపై ఫిర్యాదులు రావడంతో అతన్ని చిన్నశంకరంపేట వైద్యాదికారిగా నియమించామని విజయనిర్మల త్వరలోనే పెద్దశంక రంపేట మండలానికి నూతన వైద్యాధికారిని నియమిస్తా మన్నారు. పేట పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య మెరుగ్గానే ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులందరికీ నాణ్యమైన సేవలు అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారిగా విజయ నిర్మల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తొలిసారిగా పెద్దశం కరంపేటకు రావడంతో సిబ్బంది పూలమాలలు, పుష్పగు చ్చంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్ కుమార్, మండల వైద్యాధికారి సారిక, పీమె చ్సీ సిబ్బ ంది భూమయ్య, సాయిలు, రామ్మోహన్, వెంకటేశం, శివప్ర సాద్, సంపూర్ణ, శ్రీదేవి, కమల తదితరులు పాల్గొన్నారు.