Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హవేలీఘనపూర్
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాయిన్ చెరువు, లింగాసాన్ పల్లి, బి తిమ్మాయిపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మాట్లాడుతూ రైతులు పండించిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఎవరు అధైర్య పడద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసమే కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపిపీటీసీల పోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్య రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు మంద శ్రీహరి, మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మేకల సాయిలు, బోయిని రాజు, మెదక్ ప్రాథమిక సహకార సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఫ్యాక్స్ సొసైటీ డైరెక్టర్ కసిరెడ్డి సిద్ధిరామిరెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.