Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ జూడో యాత్రను జయప్రదం చేయాలి
- టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని బూరుగుపల్లి శివాయపల్లి, పెద్ద శంకర ంపేట్ తదితర గ్రామాలలో రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడోయాత్రను దిగ్విజయం చేయాలని కోరుతూ బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దశంకరంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో రాణి శంకరమ్మ భూముల విషయంలో రైతులు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులు ఒత్తిడి తెస్తే తమను సంప్రదిం చాలన్నారు. కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నవంబర్ ఆరవ తేదీన ఉదయం కోల్లపల్లి వద్ద రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుందని, అధిక సంఖ్యలో యువకులు, ప్రజలు భారత్ జోడోయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు వినోద్ పాటిల్. సురేందర్ రెడ్డి, దాచా సంగమేశ్వర్, జె నారాగౌడ్, విజయరావు, రాజశేఖర్ రెడ్డి, సాయి రెడ్డి, సంగ య్య, వీర గౌడ్, ప్రతాప్ గౌడ్, వెంకట్ రాములు, రవీందర్, అనిల్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. పేట మండల పరిధిలోని శివయ్య పల్లి గ్రామంలో బుధy ారం పీసీసీ సభ్యులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీల కు చెందిన దాదాపు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.