Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని కె.వెంకటాపూర్ గ్రామంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్దరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. గతంలో ఎక్కడ చూసినా దళారి వ్యవస్థ ఉండేదని, దళారుల బారిన పడకుండా రైతులను కాపాడేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఏ రకం వడ్లకు రూ.2060లు, బి రకం వడ్లకు రూ.2040ల ధర ప్రకటించిందన్నారు. 41 కిలో వరకే తూకం చేయాలని వడ్ల కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్, గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, ఏపీఎం వెంకట స్వామి, వెంకటాపూర్ మాజీ సర్పంచి సత్యనారాయణ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దయాకర్, పీఏసీఎస్ డైరె క్టర్ మధుసూదన్ రెడ్డి, ఐకేపీ నిర్వాహకులు లక్ష్మి, కవిత, నం దు, గ్రామ డైరెక్టర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.