Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బండారి చంద్రయ్య మాట్లాడుతూ గద్వాల జిల్లా ధరూర్ మండ లంలోని రేగులపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన రఘు రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. మాల మహానాడు జిల్లా కార్యదర్శి దుబాసి సంజీవ్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగ్రకుల అహంకారిని కఠినంగా శిక్షించాలని, అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో వేయాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అయ్యy ారి లక్ష్మణ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రచార కార్యదర్శి రాగుల బాబు, కొమ్మాట రామస్వామి, నస్కల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.