Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
ఆయిల్ ఫామ్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని గజ్వేల్ వ్యవసాయ డివిజన్ అధికారి బాబు నాయక్, గజ్వేల్ వ్యవ సాయ అధికారి నాగరాజు అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో ఆయిల్‌పామ్ పంట సాగు పౖ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్ఫామ్ సాగుకు అవ సరమైన మొక్కలు, డ్రిప్ సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. తోట నిర్వహణ ఎకరాకు రూ.4,200 నాలుగేండ్లు ఇస్తారన్నారు. 4వ సంవత్సరం నుం చి 10 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల ఆదాయం వస్తుందన్నారు. సర్పంచ్ భాగ్య నర్సింలు, ఉపసర్పంచ్ ప్రతాప్ రెడ్డి, ఏఈఓ జ్యోతి పాల్గొన్నారు.