Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశిం చింది. గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ నుంచి ప్రారంభమై పాద యాత్రగా శివ్వంపేట మండల ంలోని ఫసల్వాదీ గ్రామం చేరుకుంటుంది. ఫసల్వాదీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఛైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో రాహూల్ గాంధీకి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు టీపీసీసీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి లక్ష్మీ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మార్రెలి అనిల్ తెలిపారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహు ల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు స్వాగతం పలుకుతూ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ సూచన మేరకు టీపీసీసీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్రెడ్డి ఆధ్వ ర్యంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎంఎన్ఆర్ ఆసు పత్రి నుంచి రోడ్డుకు ఇరువైపులా జోగిపేట, అన్నసాగర్ వరకు భారీ కటౌట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మార్రెలి అనిల్ తెలిపారు.