Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో ప్రారంభమైన జోడోయాత్ర
నవతెలంగాణ-రామచంద్రాపురం
భారత్ జోడోయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సంగారెడ్డి జిల్లా ముఖద్వారమైన రామచంద్రపురంలోని భేల్ చౌరస్తాకు బుధవారం చేరుకు న్నారు. జిల్లాకు చేరుకున్న రాహుల్ గాంధీని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్రెడ్డిలను రామచంద్రాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ గాలి అనిల్ కుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. భేల్ చౌరస్తా నుండి అశోక్ నగర్, బీరంగూడ కమాన్ ఇక్రిశాట్ మీదుగా పటాన్చెరు వైపు పాదయాత్రగా రాహుల్ గాంధీ పయనించారు. ఆయన వెంట రామచం ద్రపురం తెల్లాపూర్ మున్సిపాలిటీ సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మవీన్ గౌడ్, శ్యామ్ రావు, ప్రభాకర్ రెడ్డి, రవీందర్, రాజు మరియు మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పతాకాలను పట్టుకొని పయనిం చారు. రాహుల్ గాంధీ మరియు యాత్రను తిలకించేందుకు జాతీయ రహదారి ఇరువైపులా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నాయకులకు అభివాదం తెలియజేశారు. జోడో యాత్రలో భాగంగా డప్పు వాయిద్యాలతో వివిధ రకాల కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కొన్ని మీటర్ల మేర వాహ నాలు యాత్రకు ముందు వెనకాల ఉండడంతో కొంతసేపు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి.