Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ యస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆందోల్ మండల పరిధిలోని మన్సాన్పల్లి, రోలపాడు, చింతకుంట, అన్నాసాగర్, నాదులా పూర్, మాసానిపల్లి, కొండారెడ్డిపల్లి, సంగుపేట, సాయిబాన్ పేట గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేందుకు రైతుల సౌకర్యార్థం, వారికి అందుబాటులో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుం దన్నారు. రైతులు తమ ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్య దళారులకు తక్కువ రేటుతో అమ్ముకొని నష్టపోకూడదని విజ్ఞప్తి చేశారు. కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ ఎంపీపీ జోగు బాలయ్య, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నారాయణ, ఆయా గ్రామాల సర్పం చులు కవితా బాల్ సింగ్, సుజాత గోపాల్, మార్కెట్ డైరెక్టర్ మాణిక్ రెడ్డి, ఐకెపి మండల కోఆర్డినేటర్ మాణిక్యం, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.