Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సదాశివపేట
దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం, బీజేపీ పాలనలో దళితులపై పెరుగుతున్న హింసకు నిరసనగా సామాజిక సంఘాలన్నింటిని ఐక్యం చేస్తూ.. ఐక్య ప్రతిఘటన నిర్వహించడానికి ఈనెల 5న న్యూ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కేవీపీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన సదాశివపేట మండల కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ 8ఏండ్ల పాల నలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 300రేట్లు దాడులు పెరిగాయన్నారు. దళితుల, పేదల ఉపాధి వనరుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ.. చట్టాన్ని నీరుగార్చి పేదల పొట్టలు కొట్టిందని ఆరోపించారు. నీతి అయోగ్ సాకుతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్ అమలు చేయకుండా దేశంలో 20శాతం ఉన్న దళితులకు ద్రోహం చేసిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకించి యూపీలో దళితులు అబధ్రతలో ఉన్నారన్నారు. 5న నిర్వహించనున్న జాతీయ సదస్సులో దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామా జిక న్యాయం వంటి విషయాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్లో పొరాటాలు నిర్వహిస్తామన్నారు. సంఘం నా యకులు శ్రీనివాస్, విజయ్, సందీప్, సంపత్, భూపాల్, నగేష్, సంతోష్, లక్ష్మణ్, దాసు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.