Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యాల్కల్
ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదని, కొందరు డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని, దీంతో కళాశాలలకు, పాఠ శాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని.. సకాలంలో బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. మామిడ్గి, కల్బెమల్, వడ్బీ గ్రామ విద్యార్థులు పెద్ద ఎత్తున బీదర్ రోడ్డులో మిర్జాపూర్ (బి) ప్రధాన రోడ్డు వద్ద బైటాయించి ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు సమ యానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల్లో, బైక్‌లపై ఆల స్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నామన్నారు. కొం దరు డ్రైవర్లు కనీసం బస్సును కూడా ఆపకుండా వెళ్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పంది ంచి.. సకాలంలో బస్సులు నడపాలన్నారు. అలాగే మరిన్న ఎక్కువ బస్సులు ఈ మార్గంలో తిప్పాలని డిమాండ్ చేశారు. కాగా అరగంట పాటు విద్యార్థులు రోడ్డుపైనే బైటాయిం చడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెల్సుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ భరత్ కుమార్, హద్నూర్ పోలీ సులు ఘటనా స్థలానికి వెళ్లి.. ఆర్టీసీ అధికా రులతో మాట్లా డుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.