Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్
నవతెలంగాణ-కల్హేర్
దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పిలుపునిచ్చారు. మండలంలోని బాచేపల్లి గ్రామంలో బుధవారం కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకతీతంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన గురించి, అభివద్ధి గురించి ప్రజలకు తెలియ జేయడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమా న్ని పూర్తిగా విస్మరిస్తూ.. నిత్యావసర ధరలు పెంచుతున్న దన్నారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేక ఎంతోమంది అనేక ఇబ్బందులకు గురవుతు న్నాన్నారు. ఈ భారత్ జోడోయాత్రకు నియోజకవర్గం నుం చి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొనాలన్నారు. అనంతరం మాసంపల్లి చౌరస్తా వీరభద్ర ఫంక్షన్ హాల్ దగ్గర నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు నగేష్ షెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రె స్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కర్, పీసీసీ సభ్యులు శంకర య్య స్వామి, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్ సెట్కార్, అధ్యక్షులు బూరుగుల పోచయ్య, సంజీవరెడ్డి, శంకర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కిష్టాపూర్ దేవదాస్, మాజీ సర్పంచ్ గంగారం, సాయిబాబా మచ్చంధర్, ప్రవీణ్ గౌడ్, వార్డు మెంబర్ సాయిలు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.