Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుమ్మడిదల
మండల కేంద్రంలో యాదవ సదర్ సమ్మేళన ఉత్సవాల్లో భాగంగా ఎలుక కృష్ణ యాదవ్, దాసరి కృష్ణ యాదవ్, ఎలుక శ్రీకాంత్ యాదవ్, ఎలుక శ్రీనాథ్ యాదవ్‌ల ఆధ్వర్యంలో హాస్టల్ ప్రధాన రహదారి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. దున్నపోతుల విన్యాసలు అందరినీ ఆకట్టుకున్నాయి. అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు చిట్టబోయిన లడ్డు యాదవ్, బీజేవైఎం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చిట్టబోయిన సందీప్ యాదవ్‌ల సమక్షంలో ఆటపాటలు, ఆనందోత్సవాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా లడ్డు యాదవ్ మాట్లాడుతూ.. మండలంలో యాదవులంతా ఏకమై దున్నపోతులతో సదర్ సమ్మేళన ఉత్సవాలను నిర్వహి ంచడం ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. సదర్ సమ్మేళన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి యాదవు లకు ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి, మద్దుల బాల్ రెడ్డి, వార్డు సభ్యులు బండాల భాస్కర్, రాము, బబ్లు యాదవ్, గోకుల్ యాదవ్, శ్యామ్ యాదవ్, చెన్నం శెట్టి ఉదరు కుమార్, వెంకట్ యాదవ్, సాయి కిరణ్, దీపక్, హర్షవర్ధన్, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.